స్వతంత్ర భారత్ ఏటూరునాగారం, మార్చి 23:
బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా. జాడి రామరాజు తెలిపారు. సోమవారం రోజున ఏటూరునాగారం మండల కేంద్రంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కర్ణ సంపత్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతూ, బీజేపీ నాయకులపై అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపును అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.
అలాగే, రాష్ట్రంలో హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు, హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు గద్దల హరిబాబు, మాజీ ఎంపీటీసీ యర్రల ఎల్లయ్య, మండల ఉపాధ్యక్షులు దుర్గం దుర్గారావు, నాయకులు వినుకొల్లా చక్రవర్తి, జనగాం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు