భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను సబ్‌స్టేషన్‌లో 33కేవీ వోల్టేజ్ బూస్టర్‌ను ఆదివారం విజయవంతంగా చార్జ్ చేసినట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ జి. మహేందర్ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 6 యూనిట్ల 33కేవీ వోల్టేజ్ బూస్టర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ బూస్టర్ల వల్ల వోల్టేజ్ స్థాయి గణనీయంగా మెరుగుపడిందని, ఈహెచ్‌టీ ఎల్లందు నుండి సరఫరా అయ్యే రేడియల్ 33కేవీ మామకన్ను ఫీడర్‌పై భారాన్ని తగ్గించినట్లు వివరించారు. 78.5 సర్క్యూట్ కిలోమీటర్ల పొడవైన ఈ లైన్ ద్వారా గుండాల, మామకన్ను, అల్లాపల్లి సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు.
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఈ చర్యలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
0 కామెంట్‌లు