ఎట్టి స్వప్న కుటుంబానికి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా ఆర్థిక సాయం
గుండాల మండలం, మార్చి 11 (స్వాతంత్ర్య భారత్ ప్రతినిధి):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం పోతిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎట్టి స్వప్న శిశు సంరక్షణ శస్త్రచికిత్స సమయంలో మృతి చెందడం పట్ల స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మానవత్వాన్ని చాటుతూ సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ పోతిరెడ్డిగూడెం గ్రామ కమిటీ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసింది.
బుధవారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కలిసి ఎట్టి స్వప్న భర్త ఎట్టి రాంబాబుకు రూ.16,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కష్టకాలంలో ప్రజలతో కలిసి నిలబడటం పార్టీ ధ్యేయమని తెలిపారు. బాధిత కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మోకాళ్ళ ఆజాద్, వుకే శ్రావణ్, పూణేం లక్ష్మన్న, వుకే బాబు, వాగబోయిన మోహన్ రావు, పూణేం చలపతిరావు, మోకాళ్ళ పోతయ్య, పూణేం ప్రభాకర్, చిన్న బుచ్చయ్య, ఈసం సమ్మయ్య, వుకే వెంకన్న, అరెం మంగయ్య, వాగబోయిన శ్రీవేణి, పూణేం పుష్పలత, అరెం రాంబాయి, ఈసం సంసారక్క తదితర గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పోతిరెడ్డిగూడెం గ్రామ కమిటీ కార్యదర్శి మోకాళ్ళ ఆజాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు
0 కామెంట్‌లు