ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పెండింగ్ బిల్లులపై ఎమ్మెల్యేకు వినతిపత్రం

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పెండింగ్ బిల్లులపై ఎమ్మెల్యేకు వినతిపత్రం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లును యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గొల్లపల్లి నరేష్ కుమార్ మరియు యువజన నాయకుడు జిమ్మ జంపయ్య మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
అశ్వాపురం మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించిన L3 నుంచి L1 వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మొదటి విడతగా అశ్వాపురం మండలానికి 817 ఇండ్లు మంజూరు కాగా, అందులో L3 నుంచి L1 దశలో ఉన్న 46 మంది లబ్ధిదారులకు బిల్లులు ఆలస్యమయ్యాయని తెలిపారు.
ఈ విషయాన్ని పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో ఇప్పటికే 36 మంది లబ్ధిదారులకు విడతల వారీగా బిల్లులు చెల్లించగా, మిగిలిన 10 మంది లబ్ధిదారుల బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని నాయకులు వివరించారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇప్పటికే హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ ఎండీ గౌతమ్ మరియు సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. త్వరలోనే మిగిలిన లబ్ధిదారులకు కూడా బిల్లులు విడుదల చేస్తామని, ఎవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు