ఆదిలాబాద్: చిట్టీల పేరిట డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిన అక్షర చిట్‌ఫండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పేరాల శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
హనుమకొండ జిల్లా వడ్డెపల్లికి చెందిన శ్రీనివాసరావు 2009లో సొంతంగా చిట్‌ఫండ్ వ్యాపారం మొదలుపెట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిట్టీ స్కీంలను ప్రారంభించారు.వందల మంది నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించారు.
గడువు ముగిసిన తర్వాత ఖాతాదారులకు తిరిగి డబ్బులు చెల్లించకుండా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు.
ఆదిలాబాద్ టూటౌన్ పరిధిలోనే 12 కేసులు నమోదవగా బాధితులకు రూ.1.11కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 96 చీటింగ్ కేసులు నమోదు కావటంతో ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నారు.
పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఆదిలాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.శ్రీనివాసరావుకు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నాయని.. వాటిలో ఇప్పటికే కొన్ని జప్తు కాగా మిగతా వాటిని కూడా చట్టపరంగా జప్తునకు చర్యలు తీసుకుంటామన్నారు.
0 కామెంట్‌లు