విద్యా రంగానికి తక్కువ కేటాయింపులు: యెర్రా కామేష్ విమర్శలు

విద్యా రంగానికి తక్కువ కేటాయింపులు: యెర్రా కామేష్ విమర్శలు
కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం కేవలం 8.2 శాతం మాత్రమే కేటాయించారని ఆయన ఆక్షేపించారు. ఈ నిధులు ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోవని అన్నారు.
మొత్తం రూ.3,24,234 కోట్ల బడ్జెట్‌లో వైద్య రంగానికి కేవలం రూ.13,679 కోట్లు మాత్రమే కేటాయించడం ద్వారా పేదల ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడిందని విమర్శించారు.
అలాగే జాబ్ క్యాలెండర్‌పై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం, ఆరు గ్యారంటీల అమలు గురించి స్పష్టత లేకపోవడం, ఉద్యోగుల పీఆర్సీపై ప్రకటన లేకపోవడం దురదృష్టకరమన్నారు.
రాజీవ్ యువ వికాసానికి రూ.6,000 కోట్లు కేటాయించినప్పటికీ ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ అంకెల గారడీ తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగం లేదని యెర్రా కామేష్ విమర్శించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు