కరకగూడెం మండల కేంద్రంలో శుక్రవారం సఫీయా మజీద్‌లో ముస్లింల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మజీద్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడిగా పఠాన్ సాబేర్ ఖాన్, ఉపాధ్యక్షుడిగా షేక్ యాకూబ్ పాషా, కార్యదర్శిగా షేక్ యాకూబ్ పాషా, క్యాషియర్‌గా ఎస్‌కే ఖలీల్, కోశాధికారిగా ఎస్‌కే సోనీలు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మజీద్ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, ముస్లింలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పఠాన్ అక్బర్ ఖాన్, సాదిక్, సలీమ్, అజ్మత్, అఫ్రోజ్, రోహిత్, ఖలీల్, అజ్జు, ఇర్ఫాన్, జాహీద్, ఇలీయాజ్, రియాజ్, జలీల్, ఖలీమ్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు