మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన సీతక్క తనయుడు కుంజా సూర్య



స్వతంత్ర భారత్  ములుగు 20: కన్నాయిగూడెం మండలంలోని రాజన్నపేట గ్రామంలో “యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్” (UWH) సంస్థ ఆధ్వర్యంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి, మంత్రివర్యులు సీతక్క గారి తనయుడు కుంజా సూర్య శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ద్వారా స్థానికులకు ఆరోగ్యకరమైన తాగునీరు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా, మండల ఇంచార్జి (సర్పంచ్) జాడి రాంబాబు, రాజన్నపేట సర్పంచ్ పోడెం నర్సింహారావు, ఆర్టీఏ రాష్ట్ర డైరెక్టర్ వసంత శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, మండల కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మండల యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు తదితరులు 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు