ట్రైన్ నుంచి దూకి యువకుడు ఆత్మహత్య.. మణుగూరుకు చెందిన యశ్వంత్ మృతి

ట్రైన్ నుంచి దూకి యువకుడు ఆత్మహత్య.. మణుగూరుకు చెందిన యశ్వంత్ మృతి
మహబూబాబాద్ జిల్లా: మణుగూరుకు చెందిన యశ్వంత్ అనే యువకుడు ట్రైన్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం, మహబూబాబాద్ జిల్లా మానుకొండలో ఒక కేసు వాయిదా కోసం వెళ్లిన యశ్వంత్, తిరుగు ప్రయాణంలో ట్రైన్‌లో వస్తుండగా మనస్థాపానికి గురై ట్రైన్ నుంచి దూకినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు