పినపాక మండలం: గాలికుంటు వ్యాధి నివారణ కోసం చేపట్టిన టీకాల కార్యక్రమాన్ని డీవీఏహెచ్ఓ ఎం. వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు.
మండలంలోని ఈ బయ్యారం గ్రామంలో పశువులకు నిర్వహిస్తున్న టీకాల ప్రక్రియను స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ ఉజ్వలతో కలిసి పరిశీలించారు. కార్యక్రమం నిర్వహణ విధానం, టీకాల పంపిణీపై సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు.అనంతరం రైతులతో మాట్లాడిన ఆయన, పశువుల ఆరోగ్యం కాపాడేందుకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో రైతుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.
0 కామెంట్‌లు