ఆల్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలలో బీటీపీఎస్ ఉద్యోగి అమీర్ ఖాన్‌కు తృతీయ స్థానం

ఆల్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలలో బీటీపీఎస్ ఉద్యోగి అమీర్ ఖాన్‌కు తృతీయ స్థానం
రాజస్థాన్: రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించిన 47వ ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో టీజీ జెన్కో తరఫున పాల్గొన్న బీటీపీఎస్ ఉద్యోగి అమీర్ ఖాన్ (ఆర్టిజన్) ప్రతిభ కనబరిచి 105 కిలోల విభాగంలో తృతీయ స్థానం సాధించారు.
ఈ సందర్భంగా బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ బి. బిచ్చన్న క్రీడాకారుడిని అభినందించి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ, ఆల్ ఇండియా స్థాయిలో టీజీ జెన్కో, బీటీపీఎస్ తరఫున పాల్గొని పతకం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.
సంస్థ క్రీడాకారులు, కళాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, భవిష్యత్తులో కూడా జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ, వారి అభ్యున్నతికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు