గ్రామపంచాయతీలో సమస్యలపై దృష్టి సారించిన సర్పంచ్

పినపాక మండలం మల్లారం గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ సాంబశివరావు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టారు. రిపేర్‌లో ఉన్న హ్యాండ్ పంపుకు కొత్త పైపులు అమర్చి మరమ్మతులు పూర్తి చేశారు. దీంతో గ్రామస్తులకు తాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారమైంది. అలాగే కరెంట్ మెయిన్ వైర్లకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి భద్రతా చర్యలు చేపట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు