భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని విద్యుత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం (10-03-2026) విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టు నిర్వహించనున్నట్లు TGNPDCL విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ ఎన్.వి. వేణుగోపాల్ చారి తెలిపారు.
ఈ లోకల్ కోర్టులో విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ మార్పు, వోల్టేజ్ హెచ్చు తగ్గులు, నూతన సర్వీస్ మంజూరు, సర్వీస్ రద్దు తదితర సమస్యలపై వినియోగదారులు వ్రాతపూర్వకంగా తమ ఫిర్యాదులు అందించవచ్చని తెలిపారు.
ఫిర్యాదులను ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. మణుగూరు సబ్‌డివిజన్ పరిధిలోని కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
0 కామెంట్‌లు