పశువుల అక్రమ రవాణా నిందితుడిపై బైండోవర్ చర్య

పశువుల అక్రమ రవాణా నిందితుడిపై బైండోవర్ చర్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలో పలు పశువుల అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ మోయిజ్ ఖురేషిని సోమవారం అశ్వాపురం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
మళ్లీ పశువుల అక్రమ రవాణాకు పాల్పడకుండా ఉండేందుకు రూ.5 లక్షల పూచీకత్తు తీసుకుని, ఒక సంవత్సరం పాటు సత్ప్రవర్తన కలిగి ఉండేలా బైండోవర్ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా అశ్వాపురం సీఐ మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు