మణుగూరు గురుకులంలో ఉద్రిక్తత.. మీడియా, అధికారులకు ప్రవేశం నిరాకరణ

మణుగూరు గురుకులంలో ఉద్రిక్తత.. మీడియా, అధికారులకు ప్రవేశం నిరాకరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన మెడికల్ సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులను పాఠశాల నిర్వాహకులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై సరైన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురుకుల పాఠశాల నిర్వాహకుల తీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు