అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మహాత్మ జ్యోతి పూలే గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరామర్శించారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు