భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోని భూపతిరావుపేటకు వెళ్లే రహదారిపై ఉన్న శంకర్ దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో చోరీకి ప్రయత్నం జరిగింది. దుకాణంలో చోరీకి ప్రయత్నిస్తున్న వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే పట్టుకున్నారు. అనంతరం దొంగకు దేహశుద్ధి చేశారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టుబడిన వ్యక్తి చెగర్షల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
0 కామెంట్‌లు