ఈ బయ్యారం ఎస్సై సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మహిళా సర్పంచులు

ఈ బయ్యారం ఎస్సై సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మహిళా సర్పంచులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మహిళా సర్పంచులు ఈ బయ్యారం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని గ్రామాలలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఎస్సై సురేష్ కూడా గ్రామాల అభివృద్ధి, ప్రజల భద్రత కోసం సర్పంచుల సహకారం అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పినపాక మండలానికి చెందిన పలువురు మహిళా సర్పంచులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు