మహిళల భద్రత – మా బాధ్యతపై అవగాహన సదస్సు


మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేస్తూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. “మహిళల భద్రత – మా బాధ్యత” అనే నినాదంతో సోమవారం రాత్రి ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ సురేష్ ఆదేశాలతో స్థానిక యువకులు, సామాజిక కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న వేధింపులు, దాడులు వంటి సంఘటనలను అరికట్టేందుకు సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు భయపడకుండా తమ సమస్యలను వెల్లడించేందుకు ముందుకు రావాలని, అవసరమైనప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
సమాజంలో మహిళలకు భద్రత కల్పించడం అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు