భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం దుదియా తండా గ్రామపంచాయతీలో సోమవారం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. రాజ్ మహ్మద్ జాన్ బీ మెమోరియల్ ట్రస్ట్ మరియు రజాక్ & బ్రదర్స్ రుద్రంపూర్ ఆధ్వర్యంలో, వరంగల్–హైదరాబాద్ శరత్ మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరానికి రేగళ్ల ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి వైద్యులు సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో దుదియా తండా గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ రమేష్, ఉపసర్పంచ్ గుగులోత్ నరేష్, గ్రామ పెద్దలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
0 కామెంట్‌లు