రంజాన్ తోఫా పంపిణీ చేసిన తహసీల్దార్ ఖాసీం

రంజాన్ తోఫా పంపిణీ చేసిన తహసీల్దార్ ఖాసీం

*గుండాల మండలం మార్చ్ 19 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని గుండాల మండల కేంద్రంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఖాసీం పాల్గొని అర్హులైన కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ ఖాసీం మాట్లాడుతూ రంజాన్ మాసం అనేది దానం, సహనం, పరస్పర సహకారం వంటి విలువలను పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు కూడా ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని ప్రభుత్వం ఈ తోఫాలను అందజేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,  పెద్దలు, అధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన సహాయంపై ఆనందం వ్యక్తం చేస్తూ తహసీల్దార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ పండుగను అందరూ శాంతి, సౌభ్రాతృత్వ వాతావరణంలో జరుపుకోవాలని అధికారులు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు