దుధియా తండా రోడ్డు దుస్థితి.. ప్రాణ భయంతో ప్రయాణం

దుధియా తండా రోడ్డు దుస్థితి.. ప్రాణ భయంతో ప్రయాణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం దుధియా తండా గ్రామపంచాయతీ పరిధిలోని కిన్నెరసాని సమీప గ్రామాల రహదారి పరిస్థితి దారుణంగా మారింది. హరియా తండా నుంచి సూర్య తండా వరకు మునియా తండా వరకు సీసీ రోడ్డు లేక ప్రజలు గత 50 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రహదారి బాగా దెబ్బతిని ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
ప్రత్యేకంగా మోరి ప్రాంతంలో రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో ఒకేసారి రెండు వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతంలో ఒక ట్రాక్టర్ బోల్తా పడి ప్రాణనష్టం జరిగిన ఘటన కూడా చోటుచేసుకుంది.
ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, మండల అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు