గడ్డం సత్యం, నాగేశ్వరావు ను పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం


ఏటూరునాగారం, మార్చి 18 (బుధవారం):
ఏటూరునాగారం మండల కేంద్రంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కర్నె సంపత్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏటూరునాగారం మండలంలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నందున, బీజేపీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పోరాటం చేయాలని సూచించారు.
సమావేశం అనంతరం బీజేపీ నాయకులు గడ్డం సత్యం వద్ద నాగేశ్వరావును పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి వెంకట్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు డా. జాడి రామరాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పళ్ల బుచ్చయ్య, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వావిలాల జనార్దన్, మండల అధ్యక్షులు దుర్గం సమ్మక్క, జానకిరావు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గద్దల హరిబాబు, మండల ఉపాధ్యక్షుడు దుర్గం దుర్గారావు, మాజీ ఎంపీటీసీ ఎర్రల ఎల్లయ్య, జనగాం ఆనంద్, నరాల రవి, అజిత్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు