పోతురెడ్డిపల్లి బయ్యారం వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

పోతురెడ్డిపల్లి బయ్యారం వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
పినపాక మండలం ఈ బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని పోతురెడ్డిపల్లి మసీదు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంజయ్ అనే యువకుడు మృతి చెందాడు. మణుగూరు నుండి ఈ బయ్యారం వైపు వస్తున్న లారీ, బయ్యారం నుండి ఈ బయ్యారం క్రాస్ రోడ్ వైపు వెళ్తున్న ఆటోను ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో సంజయ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే అతను మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు