ఎడ్జ్ లైన్స్ దాటితే చర్యలు తప్పవు.. జాగ్రత్త!

మణుగూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా గీసిన వైట్ ఎడ్జ్ లైన్స్ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ లైన్స్ దాటి పండ్ల దుకాణాలు, బోర్డులు ఏర్పాటు చేయడం లేదా వాహనాలు నిలిపితే కఠినంగా వ్యవహరిస్తారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ తెల్ల గీతలను దాటకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు