భద్రాచలం : రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈనెల 18 నుండి 20 వరకు మూడు రోజులపాటు భద్రాచలంలో పర్యటిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మంగళవా రం ఒక ప్రకటనలో తెలిపారు.బుధవారం నాడు మధ్యాహ్నం దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల శ్రీ సీతారామచం ద్ర స్వామి వారిని దర్శించుకుంటారని అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియమును సందర్శించి ఐటీసీలో రాత్రి బస చేసి గురువారం ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వ హించి అనంతరం పాపికొండల సందర్శ నకు బయలుదేరి వెళ్తారని, పాపికొండల సందర్శన అనంతరం తిరిగి రాత్రి ఐటిసి లో బస చేస్తారని పేర్కొన్నారు. 20వ ఉదయం తిరిగి హైదరాబాదుకు బయలుదేరి వెళ్తారని ఆయన తెలిపారు.
0 కామెంట్‌లు