ఇరాన్‌పై దాడులు ఆపాలి: సిపిఐ(ఎం.ఎల్) నేత షేక్ షావలి డిమాండ్

ఇరాన్‌పై దాడులు ఆపాలి: సిపిఐ(ఎం.ఎల్) నేత షేక్ షావలి డిమాండ్
ఆదోని: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులను వెంటనే ఆపాలని సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి షేక్ షావలి డిమాండ్ చేశారు. సోమవారం విజయ్‌నగర్ కాలనీలో బస్తివాసి బుడేన్ అధ్యక్షతన జరిగిన కాగడాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 95వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ ప్రపంచ శాంతి కోసం భారత్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే కాకినాడ వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతులకు రూ.1 కోటి, గాయపడిన వారికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు