పాండవగల్లు చెరువు కేసులో అధికారుల నిర్లక్ష్యం: సీపీఎం విమర్శ

పాండవగల్లు చెరువు కేసులో అధికారుల నిర్లక్ష్యం: సీపీఎం విమర్శ
ఆదోని: పాండవగల్లు గ్రామంలోని సర్వే నెంబర్ 135లో ఉన్న 20 ఎకరాల పెద్ద చెరువు కేసులో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం నేతలు కే వెంకటేశులు, కే లింగన్న విమర్శించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి వినతిపత్రం సమర్పించారు.

కోర్టులు చెరువును ప్రభుత్వ ఆస్తిగా గుర్తించినప్పటికీ అధికారులు స్వాధీనం చేసుకోలేదని, దీంతో కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, లేదంటే గ్రామస్తులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు