గుండాల: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల స్ఫూర్తిని చాటుతూ పిడిఎస్‌యూ, పివైఎల్ ఆధ్వర్యంలో గుండాల ప్రభుత్వ హైస్కూల్లో మూడు రోజుల స్ఫూర్తి యాత్ర ప్రారంభమైంది. మార్చి 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న ఈ యాత్రలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
ప్రారంభ సభలో పిడిఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృధ్వీ, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌వి రాకేష్ మాట్లాడుతూ అమరుల ఆశయాలు నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ప్రపంచ శాంతి కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
విద్య, ఉపాధి రంగాల్లో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు