‘మన బయ్యారం’ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ సేవా కార్యక్రమం

‘మన బయ్యారం’ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ సేవా కార్యక్రమం
పినపాక :పినపాక మండలం ఈ. బయ్యారం స్థానిక యువకులు బయ్యారం ప్రాంత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన “మన బయ్యారం” ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ప్రస్తుతం పినపాక మండలంలో మంచి ఆదరణ పొందుతోంది. ఈ పేజ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఈ గ్రూపు ద్వారా వచ్చిన నగదుతో సోమవారం జడ్పీఎస్‌ఎస్ ఈ బయ్యారం, పీఎస్ ఈ బయ్యారం, పీఎస్ గాండ్ల బయ్యారం పాఠశాలల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్లు శ్రీరామ్ నివేదన్, ప్రవీణ్, ప్రకాష్, శంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ గ్రూప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని భవిష్యత్తులో పేద విద్యార్థుల చదువుకు ఉపయోగిస్తామని గ్రూప్ అడ్మిన్‌లు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు