గిరిజన మహిళ భూమిపై అక్రమ నిర్మాణం.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

గిరిజన మహిళ భూమిపై అక్రమ నిర్మాణం.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం 5వ షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతం కావడంతో భూ బదలాయింపు నిషేధ (LTR) చట్టాలు 1959, 1970 అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జమ్ముల నాగమణి అనే గిరిజన మహిళ (వ్యవసాయ కూలీ) భూమిపై హక్కుల కోసం భద్రాచలం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (SDC) కోర్టులో కేసు నమోదు చేయగా, కోర్టు ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల మేరకు పినపాక మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లు పంచనామా నిర్వహించి ఆ భూమిని జమ్ముల నాగమణికి అప్పగించారు. అయితే గోపాలరావుపేట గ్రామానికి చెందిన కొంతమంది గిరిజనేతరులు ఆదివారం దౌర్జన్యంగా అక్కడ నిర్మాణం చేపట్టారు. దీనిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా రెవెన్యూ సిబ్బంది ఉదయం అక్రమ నిర్మాణాన్ని తొలగించారు.
అయినప్పటికీ అధికారులు పట్టించుకోకుండా మళ్లీ సాయంత్రం దౌర్జన్యంగా నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. SDC కోర్టు ఉత్తర్వుల మేరకు గిరిజన మహిళకు అప్పగించిన భూమిపై అక్రమ నిర్మాణం చేపడుతున్న గిరిజనేతరులపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం డిమాండ్ చేసింది.
ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు గొగ్గల ఆర్కే దొర, పినపాక మండల అధ్యక్షుడు కొమరం శ్రీను తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు