వసతి గృహాలను వారంలో ఒకసారి రెవెన్యూ, పోలీస్ శాఖలు తనిఖీ చేయాలి: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

వసతి గృహాలను వారంలో ఒకసారి రెవెన్యూ, పోలీస్ శాఖలు తనిఖీ చేయాలి: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు లో ఇటీవల జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని మండలంలోని ప్రతి వసతి గృహాన్ని వారంలో కనీసం ఒకసారి రెవెన్యూ శాఖ అధికారులు మరియు పోలీస్ శాఖ అధికారులు తప్పనిసరిగా సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశించారు.
విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని ఆయన తెలిపారు. వసతి గృహాల్లో భద్రతా చర్యలు, ఆహారం, పారిశుద్ధ్యం వంటి అంశాలను అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు సురక్షితమైన వాతావరణంలో ఉండేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు