పేదల గుర్తింపుకు ఇంటింటి సర్వే ప్రారంభం

పేదల గుర్తింపుకు ఇంటింటి సర్వే ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోట్లపల్లి గ్రామంలో పేదల గుర్తింపునకు సంబంధించిన ఇంటింటి సర్వే కార్యక్రమం శనివారం నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో సర్పంచ్ మద్దెల సమ్మయ్య, ఉపసర్పంచ్ కోరిపెల్లి రవీందర్, మాజీ సర్పంచ్ తోలేం కళ్యాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామ మ్యాప్‌ను గీసి, గ్రామంలోని ప్రతి కుటుంబ స్థితిగతులను ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా వివరించారు. అర్హులైన పేదలను ఖచ్చితంగా గుర్తించి ప్రభుత్వ పథకాలు వారికి చేరేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అవసరమైతే మరల ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలను సేకరిస్తామని పేర్కొన్నారు.
మాజీ సర్పంచ్ తోలేం కళ్యాణి మాట్లాడుతూ, 2003లో కూడా ఇలాంటి సర్వే నిర్వహించగా గ్రామానికి పలు అభివృద్ధి పనులు వచ్చినట్లు గుర్తుచేశారు. అదే విధంగా ఈసారి కూడా సర్వే ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించి గ్రామ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు తోలేం మల్లేష్, ఉడుగుల రాము, కాంగ్రెస్ నాయకులు తోలేం కృష్ణ, పోలేబోయిన నాగేశ్వరావు, బడే అనిల్, చిట్టి శ్రీను, పోలేబోయిన రాంబాబు, ఏపీఎం విజయ, సీసీ వెంకటలక్ష్మి, సీఆర్‌పీలు పద్మ, అనూష, స్నేహ, అశ్విని, వీఓ అధ్యక్షులు బడే రమాదేవి, వీఓఏ బడే శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు