మణుగూరు గ్రంథాలయంలో ప్రజాపాలన ప్రగతి కార్యక్రమం

మణుగూరు గ్రంథాలయంలో ప్రజాపాలన ప్రగతి కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని గ్రంథాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మణుగూరు గ్రంథాలయానికి వైఫై కనెక్షన్ ఏర్పాటు చేసిన దూపకుట్ల అనిల్ సేవలను అభినందించారు. డిజిటల్ సౌకర్యాలు పెరగడం వల్ల విద్యార్థులు, యువతకు మరింత ఉపయోగం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ సభ్యత్వ నమోదు నిర్వహించి, పుస్తకాలను పంపిణీ చేశారు. పాఠకులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ నగర్ సర్పంచ్ కొమరం జగదీశ్వరి, ఉపసర్పంచ్ శ్రీను నాయక్, గ్రంథాలయ సిబ్బంది గీత మరియు ఇతరులు పాల్గొన్నారు. కార్యక్రమం సాఫీగా నిర్వహించబడింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు