మణుగూరు చెరువు పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తూ బయటకు విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమ కార్యకలాపాల వల్ల సిమెంటు రోడ్లు మట్టితో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకుని రెండు మట్టి ట్రాక్టర్లను పట్టుకున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
స్థానికులు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని అధికారులు కోరారు.
0 కామెంట్‌లు