పిడుగుపాటుకు దుక్కిటెద్దు మృతి… రైతు ఆవేదన

పిడుగుపాటుకు దుక్కిటెద్దు మృతి… రైతు ఆవేదన

గుండాల మండలంలోని గుండాల పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కల్తీ సమ్మయ్య గారి దుక్కిటెద్దు పిడుగుపాటుకు గురై మృతి చెందింది. వ్యవసాయ సీజన్ ప్రారంభ సమయంలో ఎద్దు చనిపోవడం పట్ల సమ్మయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఎద్దు మృతి కారణంగా తన వ్యవసాయ పనులు దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని సమ్మయ్య విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు