పినపాక మండలం మల్లారం గ్రామపంచాయతీలో నెలకొన్న తాగునీటి సమస్యను స్థానికులు ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లడంతో అయన వెంటనే స్పందించారు. గ్రామంలో నీటి పరిస్థితిని ఎంపీడీవో వెంకటేశ్వరరావు , సర్పంచ్ ఇర్ప సాంబశివరావు తో కలిసి సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మల్లారం గ్రామం మధ్య ప్రాంతంలో మినీ ట్యాంకర్ ఏర్పాటు కోసం అనుకూలమైన స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
స్థానికులు ఈ చర్యపై సంతోషం వ్యక్తం చేస్తూ సమస్య త్వరగా పరిష్కారం కావాలని కోరుతున్నారు. సమస్యను తెలిపిన వెంటనే స్పందించిన ఎంపీడీవోకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సెక్రటరీ సందీప్, సీతంపేట సెక్రెటరీ అశోక్ తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు