భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామపంచాయతీలో నెలకొన్న తాగునీటి సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు స్పందించారు.గ్రామంలో నీటి పరిస్థితిని పరిశీలించిన గౌరవ ఎంపీడీవో వెంకటేశ్వరరావు గారు, సర్పంచ్ ఇర్ప సాంబశివరావు గారు సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మల్లారం గ్రామం మధ్య ప్రాంతంలో మినీ ట్యాంకర్ ఏర్పాటు కోసం అనుకూలమైన స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
స్థానికులు ఈ చర్యపై సంతోషం వ్యక్తం చేస్తూ సమస్య త్వరగా పరిష్కారం కావాలని కోరుతున్నారు.
0 కామెంట్‌లు