బూర్గంపాడు, మార్చి 12:
బూర్గంపాడు మండలం మోతేపట్టి నగర్‌లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికులను వ్యకస మండల కమిటీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై భారాలు మోపుతూ పేదలకు ఉపాధి దూరం చేసే విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు.
పని చేస్తేనే మస్టర్ నమోదు అవుతుందని అధికారులు చెబుతున్న కారణంగా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యాప్‌లు, నెట్ సమస్యల వల్ల ఎండలో గంటల తరబడి ఉండాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కంటి గుర్తింపు సక్రమంగా నమోదు కాకపోతే వేతనాలు రాకపోవడం కూడా సమస్యగా మారిందన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఉపాధి కార్మికులతో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యకస మండల అధ్యక్షురాలు ఎస్‌కే అబిదా, గుమ్మడి మంగా, తుమ్మల గురుస్వామి, బోడ నాగేశ్వరావు, తుమ్మల నాగయ్య, దుర్గ, సింధు, జయశ్రీ, శిరీష, శ్రీ విజయ, సత్తపురి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు