పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ శిబిరం


పినపాక మండలంలోని టీ కొత్తగూడెం గ్రామంలో గురువారం పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ క్యాంప్, నత్తల మందు పంపిణీతో పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పినపాక పశు వైద్యాధికారి డాక్టర్ ఉజ్వల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో పశువులను పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఉజ్వల మాట్లాడుతూ పశువుల్లో గర్భకోశ సంబంధిత వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. పశువులకు నత్తల నివారణ మందులు ఇవ్వడంతో పాటు ఆరోగ్య పరీక్షలు చేసి రైతులకు పశుసంరక్షణపై అవగాహన కల్పించారు. రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో టి కొత్తగూడెం సర్పంచ్ సుమలత, ఉప సర్పంచ్ రావిల్ల నరసమ్మ, సెక్రటరీ  బాదావత్ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు