అశ్వాపురం: అశ్వాపురం మండలం చింతిరియాల వద్ద గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌తో పాటు ఫ్రంట్ లోడర్ ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. అక్రమంగా ఇసుక తవ్వకం, రవాణా చేస్తున్నట్లు గుర్తించి రెండు వాహనాల యజమానులపై పీడీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు కొనసాగిస్తున్నామని, చట్ట విరుద్ధంగా ఇసుక తవ్వకం లేదా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
0 కామెంట్‌లు