భద్రాచలంలో సార్వభౌమ సేవ – మాడవీధుల్లో రామయ్య ఊరేగింపు

భద్రాచలంలో సార్వభౌమ సేవ ఘనంగా – మాడవీధుల్లో రామయ్య ఊరేగింపు
భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సార్వభౌమ సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, వేడుకలు జరిపి అనంతరం స్వామివారిని అలంకరించి మాడవీధుల్లో శోభాయాత్రగా ఊరేగించారు.
భక్తులు భారీగా తరలివచ్చి “జై శ్రీరామ్” నినాదాలతో స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సాగిన ఈ ఊరేగింపు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. దేవస్థానం అధికారులు, అర్చకులు ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు