కోనేరులో మునిగి యువకుడు మృతి

సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయ కోనేరులో ప్రమాదవశాత్తు మునిగి పెద్దాపురం కొత్తపేట ప్రాంతానికి చెందిన వెన్నెల ప్రశాంత్ (27) మృతి చెందాడు. ప్రశాంత్ కు ఇటీవల 4రోజులు క్రితం నిశ్చితార్థం జరిగినట్లు బంధువులు పేర్కొంటున్నారు. ఉగాది పురస్కరించుకుని నిశ్చితార్థమైన యువతి బంధువులతో కలిసి సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి ప్రశాంత్ రావడం జరిగింది.ఆలయం వద్ద కోనేరు జలాశయంలో స్నానమాచరించేదుకు దిగి ప్రశాంత్ మునిగిపోవడం జరిగింది. కోనేరులో మునిగిపోయిన ప్రశాంత్ ను స్థానికులు, తోటి స్నేహితులు సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి ప్రశాంత్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో ఆస్పత్రి ఆవరణ అంతా బంధువుల రోదనలతో విషాదంగా మారింది....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు