శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు


జానంపేట గ్రామంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సర్పంచ్ ఉమామహేశ్వరి, ఉపసర్పంచ్ రాజేష్, ధర్మరాజుల శంకర్, రామచంద్ర రాజు, పత్తిపాటి నాగేశ్వరరావు, పేరం వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలు, పరిపాలనా నైపుణ్యం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, యువత, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు