ఖమ్మం/కారేపల్లి, ఫిబ్రవరి 19 ( స్వాతంత్ర్య భారత్):
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఖమ్మంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న వైరా ఎస్సై పి. రామారావును గురువారం వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం అనారోగ్యంతో మృతిచెందిన రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మైసయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఎస్సై సంఘం తరపున వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో భూక్య రాంకిషోర్ నాయక్, రిటైర్డ్ ఎస్సైలు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు