పినపాక గ్రామపంచాయతీలో గ్రామసభ సమావేశం నిర్వహణ


పినపాక మండల పరిధిలోని పినపాక గ్రామపంచాయతీలో సర్పంచ్ అలివేలు అధ్యక్షతన గ్రామసభ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు హాజరై పలు సమస్యలు మరియు అభివృద్ధి అంశాలపై చర్చించారు.
గ్రామంలో తాగునీటి సమస్య, రహదారి మరమ్మతులు, పారిశుధ్యం, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపిక వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ప్రజలు తమ సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని సంబంధిత అధికారుల వద్ద పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ అలివేలు హామీ ఇచ్చారు.
గ్రామ అభివృద్ధి కోసం ప్రజల సహకారం అవసరమని, ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తామని ఆమె పేర్కొన్నారు. గ్రామసభ అనంతరం ఉపాధి హామీ కార్మికులకు ఉపాధి హామీ సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తిరుపతి , సెక్రటరీ చంద్ర కుమార్,వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు