పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని రామానుజవరం నుండి కొత్త మల్లేపల్లి గ్రామానికి వెళ్లే మార్గమధ్యంలో వాగుపై సుమారు ₹2 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న వంతెన పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా వంతెన నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, పనులు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా, వంతెన బలంగా మరియు దీర్ఘకాలం నిలిచేలా నిర్మించాలని సూచించారు.
వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందుగానే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల మధ్య రాకపోకలకు ఈ వంతెన కీలకమని పేర్కొంటూ, నిర్ణీత గడువులో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు పనులను వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, గుండగాని నాగేశ్వరావు, తమ్మిశెట్టి సాంబశివరావు, సాదిని సీతయ్య, కృష్ణరావు, కేతినేని రాజేష్, రాసాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు