అశ్వాపురం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

అశ్వాపురం ప్రెస్ క్లబ్ (రి. నెం 257/2025) ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా మూడోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైన వెలమ రాజేందర్ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
సమావేశంలో వార్షిక నివేదిక, నూతన సభ్యుల చేర్పులు, ఐడి కార్డులు, అక్రీడేషన్లకు సంబంధించిన తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. త్వరలో జర్నలిజంపై ట్రైనింగ్ తరగతులు నిర్వహించి ప్రెస్ క్లబ్ బలోపేతానికి కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు వెల్లడించారు.
అదేవిధంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (TWJF) సంఘానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ, యూనియన్ సహకారంతో జిల్లాలో ప్రెస్ క్లబ్‌కు ప్రత్యేక స్థానం తీసుకురావాలని సంకల్పం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అశ్వాపురం ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు