అశ్వాపురం మండలం పరిధిలోని మొండికుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ డ్రైవర్ సున్ను జయంత్ (22) చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికుల సమాచారం మేరకు, ఈ ఘటన అనుమానాస్పదంగా ఉన్నట్లు భావిస్తున్నారు. జయంత్ మృతి ఆత్మహత్యా? లేక ఇతర కారణాల వల్ల జరిగిందా? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే సీఐ అశోక్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.#Ashwapuram
#Mondikunta
#TractorDriver
#Jayant
#SuspiciousDeath
#PoliceInvestigation
#CI_AshokReddy
#LocalNews
#TelanganaNews
#SBNewsChannel
#BreakingNews
0 కామెంట్‌లు