ఆదివాసి చట్టాల ఉల్లంఘనపై భద్రాచలం ఎమ్మెల్యేపై తుడుం దెబ్బ ఆరోపణలు

భద్రాచలం: ఆదివాసి హక్కులు, ఐదవ షెడ్యూలు చట్టాల అమలుపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పై తుడుం దెబ్బ సంఘం తీవ్ర ఆరోపణలు చేసింది.
బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి, ప్రస్తుతం అధికార పార్టీ మద్దతుతో కొనసాగుతున్న ఎమ్మెల్యే మద్యం సిండికేట్ వ్యాపారులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఆదివాసి భూములపై అక్రమాలు, పెట్రోల్ బంకుల వ్యవహారాలు, మైనింగ్ మరియు భూదందాలు జరుగుతున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.
నియోజకవర్గంలో ఐదవ షెడ్యూలు చట్టాల ఉల్లంఘన జరుగుతోందని, రాజ్యాంగ పరిరక్షణలో ఎమ్మెల్యే విఫలమయ్యారని తుడుం దెబ్బ నాయకులు పేర్కొన్నారు. ఆదివాసుల హక్కులకు భంగం కలిగితే చట్టపరంగా పోరాటం చేస్తామని, అవసరమైతే ఓటు ద్వారా తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే నుంచి స్పందన రావాల్సి ఉంది.

#Bhadrachalam
#TudumDebba
#AdivasiRights
#TellaVenkataRao
#FifthSchedule
#TribalLands
#TelanganaPolitics
#సబీన్యూస్ఛానల్
#SBNEWS 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు